పలువురు బాధిత కుటుంబాలకు సునీల్ కుమార్ పరామర్శ

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని హాస కొత్తుర్ గ్రామంలో పలు బాధిత కుటుంబాలను ఆదివారం బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టి ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పరామర్శించారు. గ్రామానికి చెందిన ఎల్ల రమేష్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.10వేల ఆర్థిక సహాయం చేశారు. అదే గ్రామానికి చెందిన రాజేందర్ వాళ్ల నాన్న లింబాద్రి ఇటివల జరిగిన ప్రమాదంలో కాలు విరగడంతో వైద్యులు కాలును తొలగించారు. ఆయనను పరామర్శించి దైర్యాన్ని కల్పించారు. గ్రామానికే చెందిన మేకల క్రాంతి వాళ్ల నాన్న అనారోగ్యంతో బాధపడుతున్నారు.ఆయనను పరామర్శించి అనారోగ్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలెపు నర్సయ్య, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
వేల్పూర్ మండలంలో: మండలంలోని కుకునూర్ గ్రామానికి చెందిన మర్రి నారాయణ ఇటీవల అనారోగ్యంతో మరణించారు ఈ విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ ఆదివారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. వేల్పూర్ మండలం మోతే గ్రామానికి చెందిన తిరుపతి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి కాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. విషయం తెలుసుకున్న సునీల్ కుమార్  నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను పరామర్శించి ఆరోగ్య సమాచారాన్ని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు ఆయన వైద్య ఖర్చుల కోసం రూ.10వేల ఆర్థిక సహాయం చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టి నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.