మెండోరా మండలంలోని పలు గ్రామాలలో బాధిత కుటుంబాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ శనివారం పరామర్శించారు. చాకిర్యాల గ్రామానికి చెందిన బొంత దేవన్న గుండెపోటుతో మరణించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు.
కోడిచర్ల గ్రామానికి చెందిన నరేందర్ రెడ్డి వాళ్ల భార్య సంధ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. అనారోగ్యాలకు గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.