బాధిత కుటుంబాలను పరామర్శించిన సునీల్ కుమార్

Sunil Kumar visited the affected familiesనవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మెండోర మండల కేంద్రంలో పలు బాధిత కుటుంబాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆదివారం పరామర్శించారు. మండల కేంద్రానికి చెందిన మధుమేస్త్రి వాళ్ల కూతురు నిత్యశ్రీ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. వారి కుటుంబ సభ్యులు పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. పటేల్ లింగయ్య వాళ్ళ అత్త ఎర్రక్క ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబాన్ని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. అనారోగ్యాలకు గల కారణాలు వారి వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరు పాల్గొన్నారు.