మండలంలోని పలు గ్రామాలలో పలు బాధిత కుటుంబాలను బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆదివారం పరామర్శించారు.మండల కేంద్రానికి చెందిన అఖిల రవి భార్య ఇటీవల ఆనారోగ్యంతో మరణించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. బషీరాబాద్ గ్రామానికి చెందిన లింగన్న వాళ్ళ భార్య, అమ్మ దురదృష్టవశాత్తు మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. హాసకొత్తూర్ గ్రామానికి చెందిన భూమన్న బైపాస్ సర్జరీ జరిగి దురదృష్టవశాత్తు మరణించారు. గతంలో ఆయనకు రూ.3లక్షల75వేల ఎల్ ఓసి ని అందించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలియజేశారు.హాసకొత్తూర్ గ్రామానికే చెందిన గంగారం పెరాలసిస్ వ్యాధితో బాధపడుతున్నారు. వారి ఇంటికి వెళ్లి గంగారం ను పరామర్శించారు.కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలెపు నరసయ్య, బుచ్చి మల్లయ్య, సింగిరెడ్డి శేఖర్, సాయికుమార్ గుప్తా, పడిగెల ప్రవీణ్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.