మండల కేంద్రానికి చెందిన ఒబిడి హన్మంతు ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి రూ. ఐదువేల ఆర్థిక సహాయాన్ని పంపించారు. అట్టి ఆర్థిక సహాయం మొత్తాన్ని మృతుడు హన్మంతు కుటుంబ సభ్యులకు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం అందజేశారు.హన్మంతు అనారోగ్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక సాయం పంపించిన సునీల్ రెడ్డికి అతని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నరసయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి, నాయకులు నిమ్మ రాజేంద్రప్రసాద్, నూకల బుచ్చి మల్లయ్య, ఊట్నూరి ప్రదీప్, సింగిరెడ్డి శేఖర్, దూలూరి కిషన్ గౌడ్, పూజారి శేఖర్, సాయికుమార్ గుప్తా, మారయ్య, అజ్మత్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.