బాధితునికి ఎల్ ఓ సి అందజేసిన సునీల్ రెడ్డి

నవతెలంగాణ – భీంగల్
మండలంలోని పురానిపేట గ్రామానికి చెందిన సుంకరి లక్ష్మి కుటుంబానికి రూ.2 లక్షల 40 వేల రూపాయల ఎల్ ఓ సి డబ్బులను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్ రెడ్డి ప్రభుత్వం నుండి ఇప్పించారు. లక్ష్మి  గత కొన్ని రోజులు అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స నిమిత్తం హైదరాబాదులోని నిమ్స్  ఆసుపత్రిని సంప్రదించగా  అధిక డబ్బులు ఖర్చు అవుతుండడంతో  ఇట్టి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు దైడి సురేష్ సునీల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె చికిత్స ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం నుండి 2 లక్షల  40 వేల రూపాయలను మంజూరు చేయించాడు. అట్టి మంజూరు పత్రాన్ని కాంగ్రెస్ నాయకులు బాధితురాలి కుటుంబానికి  అందజేశారు. ఈ సందర్భంగా వారు సునీల్ రెడ్డికి ,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులకు  ధన్యవాదాలు తెలిపారు.