బాధిత కుటుంబాలను పరామర్శించిన సునీల్ రెడ్డి

నవతెలంగాణ – భీంగల్
మండలంలోని ముచ్కూర్, మెండోరా గ్రామాలకు చెందిన పలువురు బాధితులను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్ రెడ్డి పరామర్శించారు. ముచ్కూర్ గ్రామానికి చెందిన సాగర్ గౌడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ఇట్టి విషయాన్ని తెలుసుకున్న సునీల్ రెడ్డి శుక్రవారం పరామర్శించి పదివేల రూపాయలను ఆర్థిక సాయం అందజేశారు. రోడ్డు ప్రమాదంలో గాయాలయ చికిత్స పొందుతున్న అదే గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ భూమేష్ ను, ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మెండోరా గ్రామానికి చెందిన బాలకృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈయన వెంట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు.