– ఆనందంతో డ్యాన్స్
వాషింగ్టన్ : భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ శుక్రవారం ఉదయం అంతర్జాతీయ రోదసీ స్టేషన్‌లోకి ప్రవేశించారని అమెరికా రోదసీ సంస్థ తెలిపింది. వీరిద్దరిని తీసుకెళ్ళిన నాసా బోయింగ్ స్టార్‌లైనర్ 5వ తేదీన ఫ్లోరిడాలోని కేప్ కేన్వరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుండి బయలుదేరి 26గంటల ప్రయాణం అనంతరం అంతర్జాతీయ రోదసీ స్టేషన్‌తో అనుసంథానమైంది. వారిద్దరు లోపలకు ప్రవేశిస్తున్న దృశ్యాన్ని నాసా విడుదల చేసింది. అప్పటికే లోపల వున్న ఎక్స్‌పెడిషన్ 71 సిబ్బంది అయిన ఏడుగురు వ్యోమగాములు సునీత, బుచ్‌లను స్వాగతించారు. లోపలకు రాగానే సునీతా విలియమ్స్ ఆనందంతో డ్యాన్స్ చేస్తున్న వీడియోని నాసా పంచుకుంది.