అగ్ని ప్రమాద బాధితునికి సుంకిరెడ్డి చేయూత ..

Sunkireddy lends a helping hand to the fire victim..– బాధితునితో మాట్లాడి ధైర్యం చెప్పిన టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి 
– ఇంటి నిర్మాణానికి సహకరిస్తానని హామీ 
నవతెలంగాణ – ఆమనగల్
కల్వకుర్తి నియోజకవర్గంలోని తర్నికల్ తాండాకు చెందిన సీత్యా నాయక్ కుటుంబం నివాసముంటున్న పూరి గుడిసె ఇటీవల అగ్ని ప్రమాదంతో కాలిపోయి కట్టుబట్టలతో సహా అన్ని వస్తువులు కాలి బూడిద అయ్యాయి. విషయం తెలుసుకున్న ఐక్యత ఫౌండేషన్ చైర్మెన్, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సీత్యా నాయక్ తో మాట్లాడి ధైర్యం చెప్పారు. యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి రాపోతు అనిల్ గౌడ్, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బీస బాలరాజు, తాండా యువజన కాంగ్రెస్ నాయకులు రాజు నాయక్ చేతుల మీదుగా తన వంతు తక్షణ సహాయంగా వారికి రూ.10 వేలు ఆర్థికసాయాన్ని అందజేశారు. అదేవిధంగా సీత్యా నాయక్ ఇంటి నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజు, నాయకులు చంద్రు, వసురాం, గోపాల్, లక్పతి, వినోద్, రాజు తదితరులు పాల్గొన్నారు.