నవతెలంగాణ-మల్హర్ రావు : కాటారం మండలంలోని ధన్వాడ గ్రామానికి చెందిన గ్రామీణ వైద్యుడు సుంకు రమేష్ వైద్య రత్న నేషనల్ అవార్డుకు ఎంపికయినట్లుగా బహుజన సాహిత్య అకాడమీ ఎంపిక కమిటీ రాష్ట్ర సభ్యుడు వంగ కుమారస్వామి తెలిపారు. సెలక్ట్ పత్రాన్ని సోమవారం హైదరాబాద్ బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ చేతులమీదుగా అందజేశారు.ఈ అవార్డును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని తిరుపతిలో గండమనేని శివయ్య మెమోరియల్ ట్రస్ట్ భవన్ లో 17 రాష్ట్రాల నుంచి 500 మంది డెలిగేటు ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొనడం జరుగుతుందన్నారు.ఈ సందర్భంగా మాట్లాడారు రమేష్ గత 30 సంవత్సరాలుగా కాటారం మండల పరిధిలోని గ్రామాలకు వైద్య సేవలో అందించుకుంటూ రాత్రనక పగలనక డబ్బులు ఇచ్చిన ఇవ్వకపోయినా వైద్య సేవలు అందించుకుంటూ ప్రజల ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మందులను ఉచితంగా ప్రజలకు పంపిణీ చేయడం జరిగిందన్నారు.కరోనా సమయంలో ప్రాణాలను తెగించి ప్రజలకు వైద్య సేవలు సహాయ సహకారాలు అందించారన్నారు.అవార్డ్ సెలెక్ట్ పత్రాన్ని ఇచ్చినందుకు నా బాధ్యత మరింత పెరిగిందని వైద్య రత్న నేషనల్ అవార్డు వచ్చేందుకు కృషిచేసిన జిల్లా అధ్యక్షులు తాటికంటే ఐలన్న, రాష్ట్ర సెలెక్ట్ కమిటీ మెంబర్ వంగ కుమారస్వామి లకు సుంకు రమేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎం ఎం గౌతమ్, ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల విజయ్ కుమార్ పాల్గొన్నారు.