sమెల్‌బోర్న్: యువ క్రికెటర్ రిషబ్ పంత్‌పై దిగ్గజ ఆటగాడు, వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాక్సింగ్ డే టెస్టులో టీమ్ ఇండియా కష్టాల్లో ఉన్న సమయంలో పంత్ ఎంచుకున్న షాట్, అవుటైన తీరు పట్ల లిటిల్ మాస్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘స్టుపిడ్, స్టుపిడ్, స్టుపిడ్’.. ఇది వికెట్‌ను పారేసుకోవటం. పరిస్థితులను అర్థం చేసుకోవాలి. ఇదేదో సహజశైలి గేమ్ అనడానికి వీల్లేదు. అదో తెలివి తక్కువ షాట్. ఆ షాట్‌తో నీ జట్టును మరింత కష్టాల్లోకి నెట్టావు’ అంటూ పంత్‌పై విరుచుకుపడ్డాడు. ‘పంత్ భారత డ్రెస్సింగ్‌రూమ్‌లోకి వెళ్లటం లేదు. మరో డ్రెస్సింగ్‌రూమ్‌కు వెళ్తున్నాడు’ అని ఆసీస్ టెలివిజన్ కామెంటరీలో సన్నీ విమర్శలు గుప్పించాడు. అప్పటికే గత ఓవర్లో అటువంటి షాట్‌కు వెళ్లిన పంత్ విఫలమయ్యాడు. మళ్లీ బొలాండ్‌పై అదే షాట్‌కు ప్రయత్నించి థర్డ్‌మ్యాన్‌కు క్యాచ్ ఇచ్చాడు. పంత్ పరిస్థితులను బేరీజు వేసుకుని ఆడాలని మ్యాచ్‌కు ముందే గవాస్కర్ సూచించిన సంగతి తెలిసిందే.