– సెమీస్‌లో పార్ల్ రాయల్స్‌పై గెలుపు
– వరుసగా మూడోసారి టైటిల్ పోరుకు
సెంచూరియన్ (దక్షిణాఫ్రికా): ఎస్ఏ20లో సన్‌రైజర్స్ అద్భుత జైత్రయాత్ర మూడో సీజన్లోనూ విజయవంతంగా కొనసాగుతుంది. తొలి రెండు సీజన్లలో చాంపియన్‌గా నిలిచిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ముచ్చటగా మూడోసారి టైటిల్ పోరుకు చేరుకుంది. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్2లో పార్ల్ రాయల్స్‌పై 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఘన విజయం సాధించింది. క్వాలిఫయర్1లో పార్ల్ రాయల్‌పై గెలుపుతో ముంబయి ఇండియన్స్ కేప్‌టౌన్ (ఎంఐ సీటీ) ఇప్పటికే ఫైనల్లోకి చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో ఎంఐ కేప్‌టౌన్‌తో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ తలపడనుంది. క్వాలిఫయర్2లో తొలుత బ్యాటింగ్ చేసిన పార్ల్ రాయల్ 20 ఓవర్లలో 174/4 పరుగులు చేసింది. రూబిన్ (81), ప్రిటోరియస్ (59) అర్థ సెంచరీలతో మెరిశారు. టోనీ (78), జోర్డాన్ (69 నాటౌట్) ధనాధన్ మెరుపులతో 19.2 ఓవర్లలోనే 177/2తో సన్‌రైజర్స్ లక్ష్యాన్ని ఛేదించింది. మరో నాలుగు బంతులు ఉండగానే 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.