పదవ తరగతి ఫలితాలలో సన్ షైన్ ప్రభంజనం

నవతెలంగాణ – చండూరు 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం  ప్రకటించిన పదవ తరగతి ఫలితాలలో స్థానిక  సన్ షైన్ పాఠశాలలో 10 మంది విద్యార్థులకు 10 జీపీ ఏ  స్టేట్ 1st ర్యాంక్  సాధించారు.  12 మందికి స్టేట్ సెకండ్ ర్యాంక్ 9.8 జీపీ ఏ , 105 మంది పరీక్షకు హాజరైన విద్యార్థులలో 77 మందికి 9 పైన జీపీ ఏ  సాధించినట్లు ఆ స్కూల్ కరస్పాండెంట్ కోడి వెంకన్న తెలిపారు.. ఈ సందర్భంగా 10 జీపీఏ సాధించిన పి అఖిల, బి అంజలి దేవి, బి భూమిక, ఎండి జువేరియా, పి రమ్యశ్రీ, జి సారిక, పి వైష్ణవి, జే. చైతన్య, బి దివ్య, కె విశ్వేక్ పదిమంది విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ కోడి వెంకన్న అభినందించడంతో పాటు పాఠశాల డైరెక్టర్ కోడి సుష్మ  ప్రిన్సిపాల్ రవికాంత్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల సమక్షంలో ఘనంగా సన్మానించారు. ఇంతటి ఘనవిజయం సాధించడానికి సహకరించిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల బృందానికి,  విద్యార్థులకు మరియు వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు.