ఇటీవల భారత కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించి ప్రకటించిన ఐఐటీ జీ ఈ ఈ మెయిన్స్ లో సన్ షైన్ విద్యార్థి కడారి వినయ దేశవ్యాప్తంగా 1604 వ ర్యాంక్ సాధించి ఐఐటీ ఖరగ్ పూర్ లో సీటు సాధించినట్లు పాఠశాల కరెస్పాండెంట్ కోడి వెంకన్న తెలిపారు. ఈ సందర్భంగా వినయ్ ని ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాల స్థాయిలోనే ఐఐటీ విద్యను బోధించడం ద్వార ఇటువంటి ఫలితాలను సాధించవచ్చని, మారుమూల గ్రామీణ ప్రాంతమైన నెర్మట విద్యార్థి కడారి వినయ్ ని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్ధలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కోడి సుష్మ, ప్రిన్సిపాల్ రవికాంత్, తండ్రి కడారి నర్సింహా, అధ్యాపకులు పాల్గొన్నారు.