వడ దెబ్బ లక్షణాలు – తీసుకోవలసిన జాగ్రతలు

– మండల వైద్యాధికారి డాక్టర్ నగేష్
నవతెలంగాణ – పెద్దవూర
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రత, వేడిగాలులు కారణంగా వడదెబ్బ (సన్ స్ట్రోక్), డీహైడ్రేషన్ సాధారణంగా వచ్చే వ్యాధులు. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకమే నని పెద్దవూర వైద్యాధికారి నగేష్ తెలిపారు. బుధవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పెద్దవూర లొ నవతెలంగాణ తో మాట్లాడారు. ఎండలు మండుతున్నాయి వడదెబ్బ తగిలే అవకాశం ఉందిని అన్నారు.చెమట పట్టకపోవడం,శరీర ఉష్ణోగ్రత పెరగడం,వణుకు పుట్టడం,మగత నిద్ర లేదా కలవరింతలు,ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారక స్థితి వంటివి వడదెబ్బ లక్షణాలఅని అన్నారు. వద్దదెబ్బ కు గురైన వెంటనే నీరు, పళ్ళ రసాలు, కొబ్బరినీళ్ళు, మజ్జిగ ద్రవపదార్థాలుఎక్కువగా తీసుకోవాలని తెలిపారు. అలాగే లేతవర్ణం, తేలికైన, కాటన్ దుస్తులు ధరించాలని,రోజూ కనీసం 5 నుంచి ఆరు లీటర్లు  నీళ్ళు త్రాగాలి,పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి,శుభ్రంగా రెండు పూట్ల స్నానం చేయాలి. భోజనం మితంగా చేయాలి,ఎండవేళ ఇంటి పట్టునే ఉండండి. బయటికి వెళ్ళాల్సి వస్తే గొడుగు, టోపి వంటివి తీసుకొని వెళ్ళాలి.ఇంట్లో కిటికీలు తెరిచి ఉంచాలి.ఫ్యాన్ వేసి చల్లగా ఉంచుకోవాలని సలహాలు సూచనలు చేశారు.మండు వేసవిలో,తీవ్ర ఉష్ణోగ్రత సమయంలో ఎక్కువగా తిరగరాదు. సూర్యకిరణాలకు, వేడిగాలికి గురికారాదు.రోడ్ల మీద చల్లని, రంగు పానీయాలు ఏ మాత్రం త్రాగవద్దు,రోడ్ల మీద అమ్మే కలుషిత ఆహారం తినకూడదు.మాంసాహారం తగ్గించాలి, మద్యం సేవించకూడదు.ఎండ వేళల్లో శరీరంపై భారం పడే శ్రమ గల పనులు చేయకూడదు.నలుపు దుస్తులు, మందముగా వున్న దుస్తులు ధరించకూడదు.నీటిని వీలైనన్ని ఎక్కువ సార్లు తీసుకోవాలి. వడదెబ్బకు గురైన  వ్యక్తిని త్వరగా నీడగల ప్రదేశానికిచేర్చాలి, చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డతో శరీరం తుడవాలి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చే వరకు చేస్తుండాలి.ఫ్యాను గాలి, చల్లని గాలి తగిలేలా ఉంచాలి.ఉప్ప కలిపిన మజ్జిగ లేదా చిటికెడు ఉప్పు కలిగిన గ్లూగోజు ద్రావణం లేదా ఓరల్ రీ హైడ్రేషన్ ద్రావణము (ఓ.ఆర్.ఎస్.) త్రాగించవచ్చు.వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలో ఉన్న రోగికి నీరు త్రాగించకూడదు.వీలయినంత త్వరగా దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్యం చేయించాలి. ఈ సలహాలు సూచనలు పాటిస్తే వడ దెబ్బనుంచి త్వరగా కోలు కోవచ్చు ని తెలిపారు.