సిద్ధార్థ్‌ సూపర్‌ సెంచరీ

Super century by Siddharth– ఎమ్మెస్కే జట్టుపై ఫ్రీడం అకాడమీ గెలుపు
హైదరాబాద్‌: ఓపెనర్లు సిద్ధార్థ్‌ 121), సూర్య (86) చెలరేగడంతో ఎమ్మెస్కే రాకెట్స్‌ జట్టుపై నల్లగొండ ఫ్రీడం అకాడమీ జట్టు 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఎమ్మెస్కే క్రికెట్‌ గ్రౌండ్‌లో జరిగిన ఈ వన్డేలో నక్ష్‌ (52), హర్ష్‌ (61) రాణించటంతో తొలుత ఎమ్మెస్కే జట్టు 50 ఓవర్లలో 260/5 పరుగులు చేసింది. ఛేదనలో సూర్య తోడుగా సిద్ధార్థ్‌ సెంచరీతో చెలరేగగా అదరగొట్టడంతో ఫ్రీడం అకాడమీ జట్టు 43.1 ఓవర్లలోనే 262/1 పరుగులతో లాంఛనం ముగించింది. సిద్దార్థ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.