హీరో సందీప్ కిషన్ నటించిన ఫాంటసీ అడ్వెంచర్ ‘ఊరు పేరు భైరవకోన’. విఐ ఆనంద్ దర్శకుడు. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా లావిష్ స్కేల్ లో నిర్మించారు. ఏకే ఎంటర్‌టైన్ మెంట్స్‌పై అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాత. ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేసింది. ఇప్పటికే ప్రదర్శించిన ప్రీమియర్స్‌కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం నేడు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బందం బ్లాక్ బస్టర్ ప్రీమియర్స్ సక్సెస్ ప్రెస్‌మీట్‌ని నిర్వహించింది. సందీప్ కిషన్ మాట్లాడుతూ, ‘దాదాపు వంద ప్రీమియర్ షోలు పడ్డాయి. థియేటర్స్‌కి వచ్చిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి థ్యాంక్స్. పాటలు, ట్రైలర్‌కు మీరు ఇచ్చిన రెస్పాన్స్, మా మీద మీరు పెట్టుకున్న నమ్మకానికి చాలా రుణపడి ఉన్నాం. ముందుగా చెప్పినట్లే ప్రీమియర్ షో టికెట్ ఉన్నవారు 20శాతం డిస్కౌంట్ వివాహభోజనంభులో రిడీమ్ చేసుకోవచ్చు. ఇది నా తరపున ప్రేక్షకులకు చిరుకానుక. ప్రీమియర్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. నా పెర్ఫార్మెన్స్‌ని చాలా మెచ్చుకున్నారు. ఇది చాలా గొప్ప ఆనందాన్ని ఇచ్చింది’ అని తెలిపారు.