సత్యభామకు సూపర్‌ రెస్పాన్స్‌

సత్యభామకు సూపర్‌ రెస్పాన్స్‌కాజల్‌ అగర్వాల్‌ లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘సత్యభామ’. ఈ చిత్రంలో నవీన్‌ చంద్ర, ప్రకాష్‌ రాజ్‌, నాగినీడు, హర్షవర్థన్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని అవురమ్‌ ఆర్ట్స్‌ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించారు. ‘మేజర్‌’ చిత్ర దర్శకుడు శశికిరణ్‌ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్‌ ప్లే అందించారు. ఈ నెల 7వ తేదీన థియేట్రికల్‌ రిలీజ్‌కు వచ్చిన ఈ సినిమా విశేష ఆదరణ పొందింది. అలాగే అమోజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతూ ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది.
ఈ నేపథ్యంలో మేకర్స్‌ మాట్లాడుతూ, ‘ఓ హత్యకేసులో ఎమోషనల్‌ అయిన సత్యభామ ఆ కేసును ఒక ఛాలెంజ్‌గా తీసుకుని ఎలా సాల్వ్‌ చేసింది?, బాధితురాలికి ఎలా న్యాయం చేసింది అనేది ఈ సినిమాలో హార్ట్‌ టచింగ్‌గా, ఇంటెలిజెంట్‌గా చూపించాం. ఇందులో కాజల్‌ అగర్వాల్‌ యాక్షన్‌ సీక్వెన్సులు హైలైట్‌ అయ్యాయి. పర్‌ఫెక్ట్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ కథతో దర్శకుడు సుమన్‌ చిక్కాల దీన్ని రూపొందించారు. ప్రైమ్‌ వీడియోలోనూ మరింత మంచి రెస్పాన్స్‌ రావడం చాలా ఆనందంగా ఉంది’ అని తెలిపారు.