అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తం శెట్టి హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘ముఖ్య గమనిక’. సీనియర్ సినిమాటో గ్రాఫర్ వేణు మురళీధర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
లావణ్య హీరోయిన్‌గా నటిస్తోంది. శివిన్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా రాజశేఖర్, సాయికష్ణ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు మారుతి విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ, ‘టీజర్ చూశాను.. చాలా ప్రామిసింగ్‌గా ఉంది. ఒక మంచి థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిందని తెలుస్తోంది. కానిస్టేబుల్‌గా విరాన్ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. టీమ్ అందరికీ ఈ సినిమా మంచి బూస్టప్ ఇస్తుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు. ‘టీజర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. డైరెక్టర్, డీఓపీ వేణుతో పని చేయడం ఆనందంగా ఉంది. మా నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కించారు. ఫిబ్రవరిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం’ అని హీరో విరాన్ ముత్తంశెట్టి చెప్పారు. దర్శకుడు వేణు మురళీధర్ మాట్లాడుతూ, ‘మా మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ అందరికీ నచ్చింది. టీజర్‌కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను. థ్రిల్లింగ్ అంశాలతో సాగే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కింది. విరాన్ చక్కగా నటించారు’ అని తెలిపారు. ‘ఆల్రెడీ మా మూవీలోని ఫస్ట్ సాంగ్ ‘ఆ కళ్ల చూపుల్లోనా..’కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే మా టీజర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుందనే నమ్మకం ఉంది’ అని నిర్మాత రాజశేఖర్ అన్నారు.