విద్యార్థులకు సూపర్‌ సేవర్‌ మెట్రోపాస్‌

నవతెలంగాణ-సిటీబ్యూరో
విద్యార్థులకు హైదరాబాద్‌ మెట్రో శుభవార్త చెప్పింది. విద్యార్థుల సౌకర్యార్థం సూపర్‌ సేవర్‌ స్టూడెంట్‌ పాస్‌-2023ను జులై 1 నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్టు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు అందరూ సద్వినియోగపరుచుకోవాలన్నారు. 1998 ఏప్రిల్‌ 1 తర్వాత పుట్టిన విద్యార్థులు ఈ పాస్‌ పొందేందుకు అర్హులని, ఈ ఆఫర్‌ కింద విద్యార్థులు 20 ట్రిప్పులకు మాత్రమే చెల్లించి, అన్ని ఫేర్‌ జోన్‌లలో 30 ట్రిప్పుల వరకు ఉచితంగా ప్రయాణించొచ్చని చెప్పారు.
అయితే, విద్యార్థులు తప్పనిసరిగా కొత్త బ్రాండెడ్‌ స్మార్ట్‌ కార్డ్‌ కొనుగోలు చేయాలన్నారు. ఒక విద్యార్థికి ఒక స్మార్ట్‌ కార్డ్‌ మాత్రమే జారీ చేస్తారని, అది కొనుగోలు చేసిన తేదీ నుంచి 30 రోజుల వరకు చెల్లుబాటు అవుతుందని తెలిపారు. ఈ ఆఫర్‌ జులై 1, 2023 నుంచి మార్చి 31, 2024 వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు ఉదయం 11 నుంచి సాయంత్రం 5 నడుమ ఈ కింది మెట్రో స్టేషన్లలో పాస్‌లు కొనుగోలు చేయవచ్చన్నారు.
జేఎన్టీయూ కళాశాల, ఎస్‌ఆర్‌నగర్‌, అమీర్‌పేట్‌, విక్టోరియా మెమోరియల్‌, దిల్‌సుఖ్‌నగర్‌, నారాయణగూడ, నాగోల్‌, పరేడ్‌ గ్రౌండ్‌, బేగంపేట, అమీర్‌పేట్‌, రారుదుర్గ్‌ సూపర్‌ సేవర్‌ మెట్రో పాస్‌లు కొనుగోలు చేసిన విద్యార్థులకు హైదరాబాద్‌ మెట్రో రైలుతో అనుసంధానం గల రిలయన్స్‌ ట్రెండ్‌, 24 సెవెన్‌ కన్వీనియన్స్‌ స్టోర్‌లు తదితర వాణిజ్య సంస్థల ద్వారా రాయితీ కూపన్‌లను కూడా పొందొచ్చని మెట్రో అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌ షషష.శ్ర్‌ీఎవ్‌తీశీ.షశీఎ సందర్శించగలరు. హైదరాబాద్‌ మెట్రోలో విద్యార్థులకు రాయితీతో కూడిన పాసులు మంజూరు ప్రకటనను ఎస్‌ఎఫ్‌ఐ స్వాగతిస్తుందని, ఈ రాయితీ పాసులు తమ పోరాట ఫలితమే అని ఎస్‌ఎఫ్‌ఐ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లెనిన్‌ గువేరా, కె.అశోక్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.