– నేపాల్‌పై బంగ్లాదేశ్ ఘన విజయం
– సూపర్8కు చేరుకున్న బంగ్లా టైగర్స్
కింగ్స్‌టౌన్ : బంగ్లాదేశ్ టైగర్స్ గర్జించటంతో ఆ జట్టు ఐసీసీ టీ20 ప్రపంచకప్ సూపర్8కు అర్హత సాధించింది. నేపాల్‌పై 21 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన బంగ్లాదేశ్ గ్రూప్-డిలో రెండో స్థానంలో నిలిచి సూపర్8 దశకు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో విజయానికి అడుగు దూరంలో ఆగిపోయిన నేపాల్.. బంగ్లాదేశ్‌పై సైతం సంచల5 రోజుల్లో 3 మ్యాచులు!
న విజయంపై కన్నేసింది. బంగ్లాదేశ్‌ను 106 పరుగులకే కూప్పకూల్చి ఆ దిశగా ఓ అడుగు ముందుకేసింది. బంగ్లాదేశ్ తరఫున షకిబ్ అల్ హసన్ (17, 22 బంతుల్లో 2 ఫోర్లు), మహ్మదుల్లా (13, 13 బంతుల్లో 2 ఫోర్లు), జేకర్ అలీ (26 బంతుల్లో 12), లిటన్ దాస్ (10, 12 బంతుల్లో 1 ఫోర్) రెండెంకల స్కోరు అందుకున్నారు. ఆఖర్లో రిషద్ హుస్సేన్ (13, 7 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్), టస్కిన్ అహ్మద్ (12 నాటౌట్, 15 బంతుల్లో 2 ఫోర్లు) ధనాధన్‌తో బంగ్లాదేశ్ వంద పరుగుల మార్క్ దాటింది. నేపాల్ బౌలర్లలో సోంపాల్ (2/10), దీపేంద్ర సింగ్ (2/22), రోహిత్ (2/20), సందీప్ (2/17) రెండేసి వికెట్లతో మెరిశారు. ఇక ఊరించే స్వల్ప ఛేదనలో నేపాల్ చతికిల పడింది. బంగ్లాదేశ్ పేసర్ హసన్ షకిబ్ (4/7), ముస్తాఫిజుర్ రెహమాన్ (3/7), షకిబ్ అల్ హసన్ (2/9) వికెట్ల వేటలో విజృంభించారు. 19.2 ఓవర్లలో నేపాల్‌ను 85 పరుగులకే కుప్పకూల్చారు. టాప్ ఆర్డర్‌లో ఆసిఫ్ షేక్ (17) సహా మిడిల్ ఆర్డర్‌లో కుశాల్ మల్ల (27, 40 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్),దీపేంద్ర సింగ్ (25, 31 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించినా.. సహచర బ్యాటర్లు చేతులెత్తేశారు. అనిల్ (0), రోహిత్ (1), సందీప్ (1), గుల్షన్ (0), సోంపాల్ (0), సందీప్ (0 నాటౌట్) తేలిపోయారు. బంగ్లాదేశ్ పేసర్ షకిబ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. ఈ మ్యాచ్‌తో గ్రూప్-డి మ్యాచులు సైతం ముగిశాయి. గ్రూప్-డి నుంచి దక్షిణాఫ్రికా నాలుగు విజయాలతో అగ్రస్థానం సాధించగా.. బంగ్లాదేశ్ మూడు విజయాలతో రెండో స్థానం సాధించి సూపర్8కు చేరుకుంది. మూడు పరాజయాలతో నేపాల్ చివరి స్థానంతో సరిపెట్టుకుంది.