నవ తెలంగాణ-శంకరపట్నం
మండలంలోని కేశవపట్నం సమ్మక్క సారలమ్మను గురువారం రాత్రి ట్రాన్స్కో సూపర్డెంట్ గంగాధర్ దర్శించుకున్నారు. వనదేవతలైన సమ్మక్క సారలమ్మ లకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈవో మారుతీ రావు, జాతర కమిటీ చైర్మన్ గుర్రం స్వామి కమిటీ సభ్యులతో కలిసి ట్రాన్స్కో సూపర్డెంట్ గంగాధర్ కు శాలువాతో సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో డి ఈ లక్ష్మారెడ్డి, ఏడి శ్రీనివాస్, ఏ ఈ సంపత్ తదితరులు పాల్గొన్నారు.