– హైదరాబాద్ ప్రధాన రహదారిపై క్షుద్ర పూజల కలకలం
నవతెలంగాణ – అచ్చంపేట రూరల్: మానవుడు చంద్రమండలంపై కాలు మోపి గ్రహాల గుట్టు విప్పుతున్న ఈ రోజులలో కూడా పల్లెల్లో మూఢనమ్మకాల నుండి ప్రజలు చైతన్యవంతం కావడం లేదనడానికి బుధవారం నాడు అచ్చంపేట నుండి హైదరాబాదు కు వెళ్లే ప్రధాన రహదారిపై నడింపల్లి గ్రామ పరిధిలో క్షుద్ర పూజల ఆనవాళ్లు కలకలం రేపడాన్ని నిలువెత్తు సాక్ష్యంగా పరిగణించవచ్చు. ప్రధాన రహదారిపై తల నుండి వేరు చేసిన నల్ల కోడి, నిమ్మకాయలు, బియ్యము, దీపము, కుండ, బట్టలు, గుమ్మడికాయలతో అక్కడి వాతావరణం భయానకంగా మారింది. పల్లెల్లో మూఢనమ్మకాలపై, క్షుద్ర పూజలపై అధికారులు, ప్రజాసంఘాలు ప్రజలలో విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.