
నవతెలంగాణ-మిరు దొడ్డి : గ్రామాల్లో మూఢనమ్మకాలు మరియు బాల్యవివాహాలు రోడ్డు ప్రమాదాలు పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని బొంపల్లి ఎస్సై భువనేశ్వర్ రావు అన్నారు సోమవారం రాత్రి అక్బర్ పేట భూంపల్లి మండలంలోని వీరారెడ్డిపల్లి గ్రామంలో సోమవారం సిద్దిపేట కమిషనరేట్ కళాబృందం వారిచే భూంపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ భువనేశ్వర్ రావు తమ సిబ్బందితో కలిసి కనువిప్పు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడో నమ్మకాలు మరియు రోడ్డు ప్రమాదాలు,హెల్మెట్ ఉపయోగం ఆన్లైన్ మోసాలు,బాల్య వివాహాలు,విద్య యొక్క ప్రాముఖ్యత,దొంగతనాల నివారణలో ప్రజల యొక్క పాత్ర,ఇతర వ్యక్తుల అపరిచిత వ్యక్తుల ద్వారా మోసపోవడం మొదలైన వాటిపైన ప్రజలను చైతన్యవంతం చేసే కళాబృందం వారిచే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ బాల మల్లేశం గౌడ్,ఉప సర్పంచ్ పంజ రాజు,పోలీస్ సిబ్బంది సాయి కృష్ణ,మహేష్,నర్సింలు, గ్రామ వార్డ్ మెంబర్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.