సీపీఐ(ఎం) ను ఆదరించండి.. జహంగీర్ ను గెలిపించండి..

– ఎన్నికల హామీలను అమలు పరచడంలో బీజేపీ ప్రభుత్వం విఫలం…
– బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మతోన్మాద రాజకీయాలను పెంచి పోషించారు..
– పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఎర్రజెండా అండగా ఉండి పోరాడుతుంది..
– భువనగిరి గడ్డపై ఎర్రజెండా ఎగరవేసేందుకు అందరూ ఏకం కావాలి…
– సీపీఐ(ఎం) భువనగిరి ఎంపీ అభ్యర్థి జహంగీర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి..
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి…
నవతెలంగాణ – మునుగోడు
పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం ప్రజల పక్షాన పోరాడే సీపీఐ(ఎం) ను ఆదరించి  ప్రశ్నించే ప్రజల గొంతుక సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి జహంగీర్ గెలిపించాలని నల్గొండ జిల్లా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి కోరారు. ఆదివారం మండలంలోని కల్వకుంట్ల గ్రామంలో నిర్వహించిన సమావేశం సీనియర్ నాయకులు నారగోని నరసింహ అధ్యక్షతన నిర్వహించారు. ఈ  సమావేశానికి  ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి  మాట్లాడుతూ కేంద్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. పేద ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు అందించకుండా దేశంలో మతోన్మాద రాజకీయాలను పెంచి పోషిస్తూ దళితులపై దాడులు నిర్వహించడం దారుణమని మండిపడ్డారు. హిందూ ముస్లింల మధ్య తగాదాలు పెడుతూ రాముడు పేరుతో రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో కార్మికులకు , రైతులకు రక్షణ లేకుండా హక్కులను కాలరాస్తూ పెట్టుబడుదారులకు వంతపడే విధంగా చట్టాలను తెచ్చి పేద ప్రజల నడ్డి విరిసిన బీజేపీ కి ఈ పార్లమెంట్ ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పాలని కార్మికులకు కర్షకులకు రైతులకు పిలుపునిచ్చారు . నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఎన్నికల హామీలు ఇవ్వడం తప్ప గెలిచిన తర్వాత పెండింగ్లో ఉన్న నక్కల గండి డిండి ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ పనులు నిధులు లేక ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది అని అన్నారు. పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగిన ఎర్రజెండా అండగా ఉండి ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించే సీపీఐ(ఎం) ను ఆదరించి బోనగిరి గడ్డపై సీపీఐ(ఎం) జెండా  ఎగరవేసేందుకు పేద ప్రజలు, రైతులు ,కార్మికులు కర్షకులు ఏకమవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ ఎన్నిక ప్రజల పక్షాన పోరాడే ప్రజా నాయకులకు… ప్రజల్ని మోసం చేసేందుకు  డబ్బుల సంచులతో  వచ్చే నాయకులకు మధ్య జరిగే యుద్ధం అని అన్నారు. ప్రజల పక్షాన పోరాడే సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి జహంగీర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం, మండల సహాయ కార్యదర్శి వరుకుప్పల ముత్యాలు , బొందు అంజయ్య ,ఐ యాదయ్యా , జి  యాదయ్యా , పి మధు ,కె మారయ్య, బి సుందరయ్య , పి కృష్ణయ్య ,కె ఆంజనేయులు , కె లింగ స్వామీ ,
ఎస్ యల్లయ్య తదితరులు ఉన్నారు.