తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి మద్దతు

– అసోచామ్‌ ప్రతినిధుల వెల్లడి
హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల్లో అభివృద్థిని కొనసాగించడానికి ఇరు ప్రభుత్వాలతో కలిసి పని చేస్తామని అసోచామ్‌ ఆంధ్రప్రదేశ్‌ అండ్‌ తెలంగాణ చైర్మెన్‌ కటారు రవి కుమార్‌ రెడ్డి తెలిపారు. హైదరాబాలో 2024-25కు గాను అసోచామ్‌ తొలి ఆంధ్రప్రదేశ్‌ అండ్‌ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి రవి కుమార్‌ రెడ్డి అధ్యక్షత వహించారు. దీనికి ఆ సంస్థ ప్రతినిధులు శ్రీధర్‌ పిన్నపురెడ్డి, బన్సిధర్‌ బండి తదితరులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో అభివృద్థికి ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి పని చేస్తామని రవి కుమార్‌ అన్నారు. సమ్మి ళిత, స్థిరమైన సామాజిక ఆర్థిక వృద్థిని సాధించాలనేదే తమ లక్ష్యమన్నారు.