అగ్ని ప్రమాద బాధితురాలికి ఆసరా..

– నిత్యావసరాలు అందజేసిన వగ్గెల పూజ
నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలం లోని మళ్ళాయి గూడెం పంచాయతీ తాటి నాగులు గుంపు అగ్ని ప్రమాద బాధితురాలు కంజ మంగమ్మకు టీపీసీసీ సభ్యురాలు వగ్గెల పూజ ఆసరాగా నిలిచారు. ఆదివారం ఆమె మంగమ్మ ను ఓదార్చి ఆర్థిక సహాయం తో పాటు బియ్యం, కూరగాయలు అందజేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇంటి నిర్మాణం కోసం రూ 5 లక్షలు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. పూజ వెంట కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉకే ముత్యాలు, నియోజకవర్గ యువజన నాయకుడు షేక్ బషీర్, రాచకొండ బంగారం, మరం దుర్గయ్య, మాడి వెంకట ముత్యాలరావు, తాటి నాగు, నారం వీరభద్రం, తాటి ముత్యాల రావు, మడివి వీరస్వామి, కలం శివ, పూసం జోగారావు, నారం లక్ష్మణరావు, కలం రాజేష్, మడివి గణేష్, గోరం నాగార్జున, మాడి వెంకటేష్, కొరసా సోమరాజు, మడివి శ్రీను, నారం ధర్మరాజులు ఉన్నారు.