సీపీఐ(ఎం) భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా.. కొండమడుగు నర్సింహను ఆదరించండి

– సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్సీ, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-భువనగిరి
సీపీఐ(ఎం)భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొండమడుగు నర్సింహను నియోజకవర్గ ప్రజలు ఆదరించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు.ఆదివారం స్థానిక సుందరయ్య భవనంలో రాష్ట్ర కమిటి సభ్యులు బట్టుపల్లి అనురాధ అధ్యక్షతన సీపీఐ(ఎం) భువనగిరి నియోజకవర్గ విస్తతస్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం ప్రజా సమస్యల కోసం పోరాటం చేసే ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న సీపీఐ(ఎం) అభ్యర్థి కొండమడుగు నర్సింహను నియోజకవర్గ ప్రజలు ఆదరించాలన్నారు. ప్రజా ఉద్యమాలను ప్రజల గొంతుకను శాసనసభలలో వినిపించేందుకు నర్సింహకు అమూల్యమైన ఓటు వేయాలని కోరారు. భువనగిరి నియోజకవర్గంలో నిరంతరం ప్రజా సమస్యలపై పని చేసే సీపీఐ(ఎం)కు ఓటు అడిగే నైతికహక్కు ఉందన్నారు.ప్రజలు సీపీఐ(ఎం) పోరాటాలను బలపరిచే విధంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఊహ తెలిసినప్పటినుండి నర్సింహ విద్యార్థి, యువజన, కళాకారుల , వ్యవసాయ కూలీల సమస్యల మీద అనేక పోరాటాలు చేసిన అనుభవం కలిగిన వ్యక్తిగా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారమే తన ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తున్నారన్నారు.భూనిర్వాసితులకు నష్టపరిహారం ఇప్పించడంలో, మూసీజల కాలుష్యాన్ని అరికట్టడంలో, జిల్లా సమగ్రాభిభివద్ధి సాధనకై అనేక పోరాటాలు నిర్వహించిన వ్యక్తిగా ప్రజల ముందుకు తీసుకొస్తున్నామని తెలిపారు.సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్‌ మాట్లాడుతూ కొండమడుగు నర్సింహ పేద బడుగు, బలహీన వర్గాల సమస్యల ప్రతినిధిగా నిరంతరం ప్రజలలో ఉంటూ ప్రజల తలలో నాలుకగా మెలిగిన వ్యక్తిగా ప్రజల ముందుకు సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థిగా వస్తున్నారన్నారు. ప్రజలు ఆయన్ను ఆదరించి మీ అమూల్యమైన ఓటును వినియోగించుకొని సీపీఐ(ఎం)సుత్తికొడవలి నక్షత్రం గుర్తు మీద ఓటు వేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేశ్‌, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్‌, సీనియర్‌ నాయకులు గూడూరు అంజిరెడ్డి, నాయకులు సిర్పంగి స్వామి, మాయ కష్ణ, దయ్యాల నర్సింహ, బొల్లు యాదగిరి, గడ్డం వెంకటేష్‌, బోలగాని జయరాములు,వనం రాజు, ఈర్లపల్లి ముత్యాలు,బోడ భాగ్య, సందేల రాజేష్‌, అన్నంపట్ల కష్ణ, గాడి శ్రీనివాస్‌, నాయకులు బండారు శ్రీరాములు, కళ్లెం సుదర్శన్‌రెడ్డి, గుండు నర్సింహ, గూడూరు బుచ్చిరెడ్డి, కొండ అశోక్‌, గందమల్ల మాతయ్య, కల్లూరి నాగమణి, లలిత, కొండమడుగు నాగమణి, మంచాల మధు,రాంచంద్రం, ఉమర్‌, కోట రామచంద్రారెడ్డి, బర్ల వెంకటేష్‌, కవుడే సురేష్‌ పలేర్ల అంజయ్య, కుకూట్ల కష్ణ పాల్గొన్నారు.