
కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుకు రాజన్న సిరిసిల్ల విద్యార్థి సంఘాల మద్దతు తెలిపారు.ఆదివారం వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు, రాజన్న సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ ను యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి గుడిసె ప్రభాకర్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పలు విద్యార్థి సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి వారి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత, విద్యార్థుల చేతుల్లోనే ఉందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అహర్నిశలు కృషి చేసి ఎం పి అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ని గెలిపించాలని వారు కోరారు. భారత రాజ్యాంగాన్ని రక్షించేందుకు, రాజ్యాంగ రక్షణలో భాగంగా బిజెపిని ఓడించేందుకు కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును గెలిపించుకోవడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని బహుజన సేన, భీమ్ ఆర్మీ, లంబాడి ఐక్యవేదిక, ఏఐఎస్ఎఫ్, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం, టియన్ఎస్ఫ్, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది అని అన్నారు. అనంతరం విద్యార్థి సంఘాల నాయకుల మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని మార్చాలని లక్ష్యంతో మత రాజకీయం చేస్తున్న బిజెపిని ఓటు అనే హక్కుతో ఓడించి సరైన బుద్ధి చెప్పాలని, ఇప్పుడు ఉన్న పరిస్థితులో రాజ్యాంగన్ని రక్షించుకోవాలంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని యువతకు పిలుపునిచ్చారు.కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును భారీ మెజారిటీతో గెలిపించాలని కోవాలని పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో బహుజన సేన జిల్లా అధ్యక్షులు జింక శ్రీధర్, భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు దొబ్బల ప్రవీణ్ , లంబాడి ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు భుక్య నరేష్ నాయక్, టీఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షులు మోతే రాజిరెడ్డి, ఏఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అంగూరి రంజిత్, ఎస్ సి ఎస్ టి విద్యార్థి సంఘ నాయకులు కుమ్మరి దేవదాస్ వివిధ విద్యార్ధి సంఘాల నాయకులు పాల్గొన్నారు.