మండలంలోని పసర గ్రామపంచాయతీ అభ్యుదయ కాలనీ వాసుడైన ఎల్లాముల గురువయ్య గత నెల 26న అనారోగ్యంతో మరణించడం జరిగింది. గురవయ్య ది చాలా నిరుపేద కుటుంబం కావడంతో శుక్రవారం అభ్యుదయ కాలనీవాసులందరూ కలిసి మృతుని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడం జరిగింది.ఒక క్వింటా సన్న బియ్యం ) 9,700 రూపాయలు నగదు ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. పదివేల రూపాయల నగదు కూడా మృతుని కుటుంబానికి అందించారు. ముందు ముందు కూడా గురవయ్య కుటుంబానికి బాసటగా కాలనీవాసులు ఉంటారని అన్నారు. కాలనీ వాసుల ఐకమత్యానికి ఉదార స్వభావానికి ప్రజలు హాట్సాఫ్ చెబుతున్నారు.