నవతెలంగాణ – బొమ్మలరామారం
గత సంవత్సర కాలం నుండి వృద్ధులకు, వికలాంగులకు, వితంతు, ఒంటరి మహిళలకు బీడీ కార్మికులకు ఎలాంటి ఆసరా పెన్షన్ మంజూరు కాలేదని భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మన్నె శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో సూపరిండెంట్ జ్ఞాన ప్రకాష్ బుధవారం వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సంవత్సర కాలం నుండి ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న నిరుపేదల ఆశలు నిరాశ పరుస్తున్న ప్రభుత్వమని, కార్యాలయ చుట్టూ దరఖాస్తులకే పరిమితమైనారని అన్నారు. ప్రభుత్వం అర్హులందరికీ పెన్షన్లు అందిస్తామని 6 గ్యారంటీలో భాగంగా ఎలక్షన్లో ఇచ్చిన హామీ ప్రకారం వృద్ధులకు రూ.4000 వికలాంగుల రూ.6000 ఇస్తామని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి పది నెలల కాలం గడుస్తున్న ఇంతవరకు ఒక్క పెన్షన్ మంజూరు కాకపోవడం విడ్డూరమని పెన్షన్ల సహాయం పెంచకపోవడం, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు మండల వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే స్పందించి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కూర వెంకటేశం, బిఆర్ఎస్ మండల నాయకులు సంద గళ్ళ పెద్దులు, అన్నారం గణేష్, పాండు నాయక్, తదితరు నాయకులు పాల్గొన్నారు.