గుజరాత్ మాదిరిగానే ఆదిలాబాద్ లో మద్దతు ధర ఇవ్వాలి

Support price should be given in Adilabad like in Gujaratనవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
గుజరాత్ లో కొనుగోలు చేస్తున్న విధంగానే పత్తి క్వింటాలుకు రూ. 8,800 మద్దతు ధర సైతం ఆదిలాబాద్ లో ఇవ్వాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ  జిల్లా అధ్యక్షులు జోగు రామన్న అన్నారు. ఈ విషయమై బుధవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. జిల్లాలో పండించే పత్తి అందరికంటే నాణ్యతగా ఉంటుందని అలాంటప్పుడు గుజరాత్ లో ఇస్తున్న మద్దతు ధర ఆదిలాబాద్ లో ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. పత్తికి తేమ శాతం 8 నుండి 12గా నిర్ణయించడం సరికాదని, గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గతంలో కొనుగోళ్ల ప్రారంభంలో 20% ఉన్న కొనుగోలు చేశారని గుర్తు చేశారు. అందుచేతనే ఈసారి సైతం తేమ శాతం 20 శాతం ఉన్న కొనుగోలు చేయాలని లేని పక్షంలో సమస్యలు ఎదురవుతాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే సీసీఐ అధికారులతో చర్చించాల్సి ఉండదన్నారు. 20 శాతం తేమ ఉన్న సిసిఐ అధికారులు కొనుగోలుపై కమర్షియల్ పర్మిషన్ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గండ్రత్ రమేష్, మార్కెట్ మాజీ చైర్మన్ లు మెట్టు ప్రహ్లాద్, సేవ్వా  జగదీష్, కుమ్ర రాజు, డైరెక్టర్ పరమేశ్వర్, గంగయ్య, రమణ, వేంకటేష్ ఉన్నారు.