
– వనం ఉపేందర్ డిమాండ్
నవతెలంగాణ యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట మండలం చిన్న కందుకూరు గ్రామం గురువారం, వికలాంగుడైన ఆడపు రాజశేఖర్ అనారోగ్యం కారణంగా అకాల మరణం చెందారు. ఈ మరణంతో తన కుటుంబం నిరాశ్రయులు అయ్యారు. ప్రభుత్వం వెంటనే వారి కుటుంబానికి 25 లక్షలు ప్రకటించి ఆదుకోవాలని జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. రాజశేఖర్ కు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు రాజశేఖర్ పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి బొల్లెపల్లి స్వామి మహిళా కార్యదర్శి కొత్త లలిత జిల్లా నాయకులు కొండాపురం మనోహర ఎర్ర సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.