– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఖమ్మం-నల్లగొండ-వరంగల్ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కు సీపీఐ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో కాంగ్రెస్, సీపీఐ భాగస్వామిగా ఉన్నాయని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కూటమిగా పోటీ చేశామని గుర్తు చేశారు. మతోన్మాద బీజేపీని ఓడించడం కోసం లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతిచ్చామని పేర్కొన్నారు. తీన్మార్ మల్లన్న విజయం కోసం పార్టీ శ్రేణులు, ప్రజాసంఘాలు కృషి చేయాలని కోరారు.