నవతెలంగాణ – మోపాల్ : నిజామాబాదు రూరల్ నియోజకవర్గం మోపాల్ మండలం బోర్గం గ్రామం ఆర్యానగర్ కాలనీ లోని కుమ్మర శాలివాహన సంఘము సుమారు 150 మంది సభ్యులు తమ సంఘము తరుపున నూడా చైర్మన్ ఈగ సంజీవ రెడ్డి ఆధ్వర్యంలో బాజిరెడ్డి కి సంపూర్ణ మద్దతుతెలుపుతున్నట్లు ఆ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు రాజవరపు శ్రీనివాస్, ప్రసాద్లు తెలిపారు. ముఖ్య అతితి గా వచ్చిన నూడా చైర్మన్ ఈగ సంజీవరెడ్డి మాట్లాడుతూ కాలనీ లోని కుమ్మర శాలివాహన సంఘానికి తన వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందని కావున బి అర్ ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ను భారీ మెజారిటీ తో గెలిపించాలని అయన కోరారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అన్ని పథకాలు పేద ప్రజలకు ఉపయోగ పడేవిధముగా ఉన్నాయ్ కాబట్టి గోవర్ధన్ భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమం లో కాలనీ వాసులు మహిళలు ఎక్కువగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో బోర్గం సొసైటీ ఛైర్మెన్ యన్. చంద్రశేకర్ రెడ్డి, గ్రామ బి అర్ ఎస్ అధ్యక్షులు ఈగ నర్సారెడ్డి, శ్రీనికసరెడ్డి, హన్మాండ్లు, రమేష్, రవికుమార్ శెట్టి, వెంకటేశ్వర్లు, అంకం రావు, రామాంజనేయులు, మల్లారెడ్డి, చిన్నరెడ్డి తదితరులు పాల్గొన్నారు.