మ‌హిళా వ్యా‌పార‌వేత్త‌ల‌కు వెన్ను‌ద‌న్ను‌గా…

Avneet Kohliప్రతి మహిళకు జీవితంలో ఏదో సాధించాలనే కోరిక ఉంటుంది. కేవలం కోరిక కుంటే సరిపోదు ఆశయం కూడా బలంగా ఉండాలి. అది ఉన్నా ఎన్నో అవాంతరాలు చుట్టుముడతాయి. అన్నింటినీ ధైర్యంగా, తెలివిగా ఎదుర్కోవాలి. ముఖ్యంగా వ్యాపారం ప్రారంభించాలంటే ఎంతో ఆలోచించాలి. అలాంటి వారి కోసమే అవనీత్‌ కోహ్లి ఎన్‌క్యూబే అనే సంస్థను ప్రారంభించారు. దీని ఆధ్వర్యంలో మహిళా పారిశ్రామికవేత్తలకు సహకరిస్తున్న ఆమె పరిచయం క్లుప్తంగా…
2012లో అవనీత్‌ కోహ్లీ ఇమేజ్‌ కన్సల్టింగ్‌లో తన మొదటి వెంచర్‌ను ప్రారంభించారు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, రిలయన్స్‌ గ్రూప్‌, మోడ్‌ ఆర్ట్‌తో పాటు ఇతర పెద్ద బ్రాండ్‌లతో కలిసి పనిచేశారు. తన సొంత ఖర్చులతోనే ఆమె దాన్ని రెండున్నర ఏండ్ల పాటు నడిపించారు. తర్వాత కాలంలో దాన్ని మూసివేయవలసి వచ్చింది. అవనీత్‌ అబుదాబిలో పుట్టి పెరిగారు. ఆమె తల్లిదండ్రులు చాలా దశాబ్దాల కిందట అబుదాబి వలస వెళ్లారు. అవనీత్‌ తన పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత ముంబైలో మేనేజ్‌మెంట్‌ చదివి, మీడియాలో తన మొదటి ఉద్యోగాన్ని ప్రారంభించారు. అక్కడ ఏడేండ్లు యాంకర్‌గా పని చేశారు.
సవాళ్లను అర్థం చేసుకోవడం
‘నేను మీడియా కెరీర్‌తో పాటు నా వ్యాపారాన్ని కూడా ప్రారంభించాను. అయితే వ్యాపారంలో నాకు బలమైన పునాది లేదు. అన్నింటినీ నేర్చుకునేందుకు చేసిన ప్రయత్నం వల్ల తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాను. దాంతో నాకు నేనుగా ఆలోచించుకొని కెరీర్‌కి కొంత విరామం ఇచ్చి ఇంటికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నాను’ అని ఆమె ఓ వెబ్‌సైట్‌తో పంచుకున్నారు. ఆ సమయం ఆమెకు మూడు సవాళ్లను అర్థం చేసుకునేలా చేసింది. అవి వ్యాపారంపై అవగాహన లేకపోవడం, సాంకేతికత నెట్‌వర్కింగ్‌, పెట్టుబడి. అటువంటి సమయంలోనే లైఫ్‌ అండ్‌ బిజినెస్‌ విజన్‌ కోచ్‌గా కూడా ఆమె సర్టిఫికేషన్‌ పొందారు.
అహుజా ఎంక్యూబే
బిజినెస్‌ విజన్‌ కోచ్‌గా ట్రైనింగ్‌ తీసుకునే సమయంలో ఆమె వస్‌వషష్ట్ర కంపెనీని నిర్మిస్తున్న దీక్షా అహుజాను కలుసుకున్నారు. ఇద్దరూ ఒకే విధమైన అభిరుచులు కలిగి ఉన్నారు. అలాగే ఇద్దరూ ఎదుర్కొన్న సవాళ్లు కూడా ఒకేలా ఉన్నాయి. ఈ అనుభవాలే వారి మధ్య బంధాన్ని ఏర్పరిచాయి. ఇద్దరూ కలిసి అహుజా ఎంక్యూబేను వ్యాపారంలో అనుభవం లేని వారికి, పెట్టుబడి లేక ఇబ్బంది పడుతున్న వారికి సహకరించేందుకు ఓ వేదికగా మార్చాలనుకున్నారు. వివిధ కోణాలను అన్వేషించాలనుకున్నారు. ఆ ఆలోచనతోనే కోహ్లి ఎన్‌క్యూబేలో అవనీత్‌ సహ వ్యవస్థాపకురాలిగా చేరారు.
నైపుణ్య కార్యక్రమాలు
‘మొదటి నుండి రెండు విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మా సొంత అనుభవాల నుండి ఇతర మహిళలకు వారి వ్యాపార ప్రక్రియను సరళీకృతం చేయాలనుకుంటున్నాం. అయితే మేము కొన్ని అంతరాలను గుర్తించాము. వాటిని పరిష్కరించడం ప్రారంభించాము’ ఆమె వివరించారు. మహమ్మారి సమయంలో నేర్చుకోవడం కోసం తపించే వ్యక్తులతో వారిద్దరూ కంటెంట్‌ను అప్‌లోడ్‌ చేసారు. వెబ్‌నార్లు, ఫోరమ్‌లు, అలాగే నైపుణ్య కార్యక్రమాలను నిర్వహించారు. 2021 చివరిలో పరిస్థితులు కాస్త మెరుగవ్వడంతో ఈవెంట్‌లను ప్రారంభించారు. మహిళా వ్యాపారవేత్తలకు పెట్టుబడులను అందించడానికి నిధులు సమకూర్చుకోవడం కూడా ముఖ్యమైన భాగంగా వారు భావించారు.
అంతరాన్ని తగ్గించడం
నాలుగేండ్లలో వారు ఆరు ప్రాజెక్టులను పూర్తి చేశారు. మహిళలు తమ ఆలోచనలు పంచుకోవడానికి, నెట్‌వర్క్‌ చేయడానికి బెంగుళూరు, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్‌, పూణె, అహ్మదాబాద్‌, దుబారులలో తమ సహాయకులను ఏర్పాటు చేశారు. ‘గత ఏడాది మేము మహిళా వ్యవస్థాపకులను ఒకే చోట చేర్చడానికి బెంగళూరులో స్టార్టప్‌ల కోసం మైక్రోసాఫ్ట్‌తో కలిసి ప్రారంభించిన నెట్‌వర్క్‌ హర్‌ అనే ఈవెంట్‌ను ప్రారంభించాం. ఎన్‌క్యూబే గ్లోబల్‌ ఇమ్మర్షన్‌ వీక్‌ (ఈజీఐడబ్ల్యూ) అనేది మహిళా వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంలో సహాయపడేందుకు నిర్వహించే కార్యక్రమం’ అని ఆమె వివరించారు.
పెట్టుబడి పరిజ్ఞానం
బిజినెస్‌ యాక్సిలరేషన్‌ ప్రోగ్రామ్‌ల ద్వారా మహిళలు అక్కడ తమ అనుభవాలను పెంచుకుంటారు. పెట్టుబడిదారులతో సంబంధాలను ఏర్పరచుకోవడం, టెక్నాలజీపై అవగాహన కోసం వ్యక్తిగత వర్క్‌షాప్‌లు నిర్వహిస్తాం. ఇవన్నీ ఆన్‌లైన్‌లో జరుగుతాయి. ఏడాదికి ఓ సారి ప్రత్యక్ష సమావేశం ఏర్పాటు చేస్తారు. ‘పెట్టుబడికి సంబంధించిన పరిజ్ఞానంలో కూడా తీవ్రమైన అంతరం ఉందని మేము గ్రహించాము. మహిళలు మహిళలలో మళ్లీ పెట్టుబడులు పెట్టేలా చేయాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు, సెషన్‌లు నిర్వహిస్తున్నాం. అయితే మగవారితో కూడా కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నాం’ అని ఆమె చెప్పారు.
మద్దతు కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌
మహిళా వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలను నిలబెట్టుకోవడానికి అనేక అవాంతరాలు ఉన్నాయని ఆమె నొక్కి చెబుతున్నారు. ‘నేడు మహిళలు అనేక వనరులను కలిగి ఉన్నారు. చాలా ఫ్రేమ్‌వర్క్‌లు ఉన్నాయి. ఒకరు జaఅఙaని ఉపయోగించి వ్యాపార ప్రణాళికను సృష్టించవచ్చు. ఇలా ఆధునిక టెక్నాలజీని మహిళలు సద్వినియోగం చేసుకోగలిగేంత పరిజ్ఞానం ఉంది’ అని అవనీత్‌ అంటున్నారు. ఆ ప్రయత్నమే వారు చేస్తున్నారు. మహిళలు తమ ఇంటి నుండే వెంచర్లను నిర్మించడానికి ఇష్టపడుతున్నారు. దాంతో కొంత ఇబ్బందులు ఉంటున్నాయని ఆమె అభిప్రాయపడుతున్నారు.
మహిళలు సిద్ధంగా ఉన్నారు
‘మహిళలు ఆలోచించడంలో, వ్యాపారాన్ని సరైన ప్రణాళికతో రూపొందించడంలో, పెట్టుబడి పెట్టగలిగేలా చేయడంలో ఇంక్యుబేటర్లు భారీ పాత్ర పోషిస్తాయి. అయితే వారి వ్యాపారం పెట్టుబడి పెట్టదగినదా లేదా అని నిర్ణయించుకోవడంలో కొంత గ్యాప్‌ వుంది. ఆలోచనలు విస్తృతంగా లేని మహిళల్లో విశ్వాసాన్ని పెంపొందించడం అతిపెద్ద సవాలు. వారిని అందుకు తగిన విధంగా సిద్ధం చేసేందుకే మేము ఉన్నాము. ఇప్పుడు వారు సిద్ధంగా ఉన్నారు’ ఆమె వివరిస్తున్నారు. భవిష్యత్తులో వీరంతా స్కేలింగ్‌, బిల్డింగ్‌ స్ట్రక్చర్‌ సిస్టమ్‌లతో పాటు మార్కెట్‌లో తమ ఉనికిని బలోపేతం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ‘ప్రారంభించడం సరైనదో కాదో తెలుసుకోవడానికి ఉత్తమ మార్గం ముందు ప్రారంభించడమే. చిన్న ప్రయోగాలతో ముందుకు వెళ్లండి. గతంలో ఆ పని చేసిన మార్గదర్శకులతో మాట్లాడండి. అన్నింటికంటే మించి మీరు లక్ష్యంగా పెట్టుకున్న కష్టమర్లతో స్వయంగా మాట్లాడండి. అతిగా ఆలోచించడం మానేయండి కచ్చితంగా విజయం మీదే’ అంటూ ఆమె తన మాటలు ముగించారు.