– ఆర్‌సీబీ 135/6
– డబ్ల్యూపీఎల్ ఎలిమినేటర్
న్యూఢిల్లీ : రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ ఆల్‌రౌండర్ ఎలిసీ పెర్రీ (66, 50 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీతో ఆ జట్టును ఆదుకుంది. 49/4తో కష్టాల్లో కూరుకున్న ఆర్‌సీబీని మెరుపు ఇన్నింగ్స్‌తో రేసులోకి తీసుకొచ్చింది. టాస్ నెగ్గిన ఆర్‌సీబీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ముంబయి ఇండియన్స్ బౌలర్ల జోరుతో ఆర్‌సీబీ వరుసగా వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ స్మృతీ మంధాన (10), సోఫీ డెవిన్ (10), దిశా (0), రిచా ఘోష్ (14) దారుణంగా విఫలమయ్యారు. ఈ సమయంలో ఎలిసీ పెర్రీ జట్టును ముందుండి నడిపించింది. ఐదు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 40 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన పెర్రీ.. ఆఖరి ఓవర్లో నిష్క్రమించింది. సోఫీ (11), జార్జియ (18 నాటౌట్) పెర్రీ తోడుగా ఆకట్టుకున్నారు. ఆర్‌సీబీ 20 ఓవర్లలో 6 వికెట్లకు 135 పరుగులు చేసింది. ముంబయి ఇండియన్స్ బౌలర్లలో హేలీ మాథ్యూస్, సీవర్, సైకాలు రెండేసి వికెట్లు పడగొట్టారు. ఎలిమినేటర్‌లో విజేతగా నిలిచిన జట్టు డబ్ల్యూపీఎల్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.