ఢిల్లీ ఎయిర్‌ క్వాలిటీ ప్యానెల్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు నాణ్యత సరిగా లేని అంశంపై శుక్రవారం సుప్రీంకోర్టు సీరియస్‌ అయ్యింది. వాయు నాణ్యతను పర్యవేక్షించడానికి, కాలుష్యాన్ని నియంత్రించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వాయు నాణ్యత నిర్వహణ కమీషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్‌ అభరు ఎస్‌ ఓకా, ఏజీ మాసిలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. గాలిలోనే మొత్తం కలుషితం ఉన్నదని, ఎన్సీఆర్‌ రాష్ట్రాలకు చెప్పినట్లు ఎయిర్‌ క్వాలిటీ ప్యానెల్‌ పనిచేయడం లేదని జస్టిస్‌ ఓకా తెలిపారు.