– జడ్జీల సంఖ్యంను పెంచాలి మాజీ ఎంపీ బి వినోద్ కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సుప్రీం కోర్టు బెంచ్‌లు దేశంలో నాలుగు ప్రాంతాల్లో ఉండాలనీ, జడ్జీల సంఖ్యను కూడా తగిన విధంగా ఎంచాలని మాజీ ఎంపీ బి వినోద్ కుమార్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ బుధవారం విలేకర్ల సమావేశంలో డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ మంగళవారం కొన్ని వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. జడ్జిల భాధలు ఆ సీట్లలో కూర్చుంటే తెలుస్తాయని ఆయన వ్యాఖ్యానించినట్టు తెలిపారు. సుప్రీం కోర్టు బెంచీలు దేశం లోని నాలుగు ప్రాంతాల్లో ఉండాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉందని గుర్తు చేశారు. లా కమిషన్ ,పార్లమెంటు స్టాండింగ్ కమిటీ కూడా ఢిల్లీ ,ముంబై ,కోల్‌కతా ,చెన్నై లేదా హైదరాబాద్‌లో సుప్రీం కోర్టు బెంచ్‌లు పెట్టాలని సూచించాయని గుర్తు చేశారు. దేశం లో 5.1కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. 20 లక్షల కేసులు 30 ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు కు 34 మంది జడ్జీలే ఉన్నారనీ, 64 మంది ఉంటే తప్పేంటని ప్రశ్నించారు.