– మాదిగ ఇంటలెక్చువల్ ఫోరం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకుందంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏ కులానికి వ్యతిరేకం కాదని మాదిగ ఇంటలెక్చువల్ ఫోరం అభిప్రాయపడింది. ఈ మేరకు సోమవారం ఫోరం అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఎస్సీల్లో ఇప్పటి వరకు అవకాశం రాని వారికి అవకాశం వచ్చేలా ప్రణాళిక రూపొందించుకుని, ఎస్సీల 15 శాతం రిజర్వేషన్‌ను 20 శాతం పెంచుకునేందుకు ఐక్య ఉద్యమాలకు కలిసి రావాలని పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు భారత రాజ్యాంగ విజయంగా, సామాజిక న్యాయం విజయంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరారు. వర్గకరణ ద్వారానే ఎస్సీల్లోని అన్ని కులాల ఐక్యత సాధ్యమని స్పష్టం చేశారు.