న్యూఢిల్లీ : చట్ట వ్యతిరేక కార్యక్రమాలు (నిరోధక) చట్టంలోని వివిధ నిబంధనలను సవాల్ చేస్తూ జెఎన్‌యు మాజీ విద్యార్థి ఉమర్ ఖలీద్ వేసిన పిటీషన్‌పై స్పందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంగళవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ పిటీషన్‌ను ఇలాంటి ఇతర పిటీషన్లతో కలిపి నవంబర్ 22న విచారిస్తామని జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేల ఎం. త్రివేదిలతో కూడిన ధర్మాసనం తెలిపింది. అలాగే ఫిబ్రవరి 2020 ఢిల్లీ అల్లర్లుకు సంబంధించి ఉపా చట్టం కింద నమోదైన కేసులో బెయిల్ కోరుతూ ఉమర్ ఖలీద్ వేసిన పిటీషన్‌ను కూడా అదే రోజు విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. 2020 ఢిల్లీ అల్లర్లులో 53 మంది మరణించగా, 700 మందికి పైగా గాయపడ్డారు. ఈ అల్లర్లుపై ఉమర్ ఖలీద్‌తో సహా షర్జీల్ ఇమామ్, ఇంకా అనేక మందిపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారు. సెప్టెంబరు 2020లో ఖలీద్‌ను అరెస్టు చేశారు.