– 9 మంది దర్మాసనం కోసం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తం
– ఎవరూ ఉద్రేక,ఉద్వేగాలకు లోనుకావొద్దు
– సంయమనం పాటించాలి
– పిక కిరణ్ ఉత్తర తెలంగాణ మాల మహానాడు అధ్యక్షులు
నవతెలంగాణ – మల్హర్ రావు/కాటారం
అగ్రవర్ణ రాజకీయ పార్టీలు కాలం చెల్లిన ఎస్సీ వర్గీకరణను పదే పదే ముందుకు తీసుకొచ్చి అన్నదమ్ములాంటి మాల మాదిగల మధ్యచిచ్చు పెట్టడం సిగ్గుచేటని ఉత్తర తెలంగాణ మాలమహనాడు అధ్యక్షుడు పీక కిరణ్ అన్నారు.కాటారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సి వర్గీకరణ ప్రయత్నాలు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చని తీర్పు ఇవ్వడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో రాష్ట్రాలకు ఎస్సీ వర్గీకరణ చేసే హక్కు లేదని, ఎస్సీ ఎస్టీలను వర్గీకరించలేమని రాజ్యాంగంలో ఎక్కడ లేదని ఇచ్చిన తీర్పును గౌరవించాలన్నారు. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్, జాతీయ న్యాయశాఖ ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదని ఇది రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పినప్పటికీ కూడా అగ్రవర్ణ రాజకీయ పార్టీలు వారి స్వార్థ ప్రయోజనాల కోసం దళితులను విడదీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడ దళితులు కలిసి ఉంటే రాజ్యాధికారం వారి సొంతమవుతుందని స్వార్థంతో దళితులను విడదీసే కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తర తెలంగాణ మాల మహానాడు నాయకులు వావిళ్ళ రమేష్ బోడ బాపు శ్రీనివాస్ పాల్గొన్నారు.