నవతెలంగాణ-నెల్లికుదురు : మండలంలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన సూర సందీప్ ను వడ్డెర సంఘం మండల అధ్యక్షునిగా నియామకం చేసినట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి ఆయిల మల్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంఘంలో ఎవరికైనా ఏ ఆపద వచ్చినా స్పందిస్తూ ఆ సంఘం అభివృద్ధిలో పాలుపంచుకుంటున్నందుకు చురుకైన వ్యక్తిగా ఉన్నందుకు అతని గుర్తించి ఆ సంఘంలో అతనికి ఈ పదవిని కట్టబెట్టినట్టు తెలిపారు నూతనంగా నియామకమైన సందీప్ మాట్లాడుతూ మండలంలోని వడ్డెరల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రతి గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసం లక్ష్మారెడ్డిల సహకారంతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరిగే విధంగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా, మండల నాయకుల కు కృతజ్ఞతలు తెలిపారు.