ప్రియమైన మిత్రులకు, తోటి బాటసారులకు, మొట్టమొదటిగా, ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే? నాతోటి ముస్లిం పౌరులను ప్రేమిస్తున్నానని తెలియ చేయడానికి, వారు నేడెదుర్కొంటున్న పరిస్థితుల పట్ల విచారం వ్యక్తపరచడానికి, నేనీ నిరసన దీక్షకు పూనుకొంటున్నాను. హిం దూమతం పేరిట, జాతీయవాదం పేరిట అయోధ్యలో జరుగు తున్న ఈనాటి కార్యక్రమాలు గర్హించడానికి, నాగొంతు చించు కుని అత్యంత ఉచ్చ స్వరంలో నా అసమ్మతిని ప్రకటించడానికి ఈ క్షణాన్ని వినియోగించుకోవాలనుకుంటున్నాను. నాకు నా మొఘల్ వారసత్వం పట్ల ఉన్న ప్రేమని ప్రకటించడానికి కూడా ఈ సందర్భాన్ని వినియోగించుకుంటున్నాను. ఇది ఎవరినో రక్షిం చడానికి చెసే పని కాదు. ఇది నా సంస్కృతికి, ఆచార వ్యవహా రాలకు సంబంధించిన విషయం.
నేను ద్రుపదని ప్రేమిస్తాను. ఖ్యాల్‌ను ప్రేమిస్తాను. కథక్‌ను ప్రేమిస్తాను. ఢిల్లీ నగరంలో ఉన్న మొఘల్, సుల్తానేట్ భవనా లను ప్రేమిస్తాను- కుతుబ్ మినార్, లేదా హుమాయూన్ సమా ధి, లేదా సబ్జ్‌బుర్జ్ లేని ఢిల్లీని నేను ఊహించలేను. ఇక పక్కనే ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ సంగతి చెప్పనే అక్కరలేదు. నవాబ్ వాజిద్ అలీషా పాలనలో అవధ్ రాజకొలువు వైభవోపేతమైన సంస్కతితో విరాజిల్లడాన్ని గౌరవిస్తాను. ఢిల్లీ సుల్తానేట్ భారత దేశానికి అత్యంత విలువైన సంస్కృతిని అందించిందని భావిస్తా ను- దాంతోనే సూఫీలు, అమీర్ ఖుస తండ్రి ఇక్కడికి వచ్చారు కదా! ఉత్తర భారతదేశంలోని భాష, సంస్కృతి, హజరత్ అమీర్ ఖుసృకి ఎంతగానో రుణపడి ఉంది. ఆయన హైందవి భాషను కవిత్వంలో ఉపయోగించారు. తదనంతరకాలంలో అది అద్భు తమైన హిందీ, ఉర్దూ భాషలుగా రూపొందాయి. ఆయన సంగీ తంలో కూడా కొత్త కల్పనలు రూపొందించి శాస్త్రీయ సంగీతానికి పునాదులు వేశారు- అదే ప్రాచీన ఉత్తరభారతదేశ సంగీతంగా అవతరించింది. ఇది మనందరం గర్వించదగిన సంగీత వార సత్వం. నిజానికి ఇలా పెంపొందిన మన వారసత్వ చిట్టాకి అంతే లేదు.
ఉత్తర భారతదేశ ప్రాచీన సంస్కృతిలో, సుల్తానేట్, మొ ఘల్, నవాబ్, నిజాంల ముద్రలు లేని ప్రాచీన సంస్కృతి లేదంటే అతి శయోక్తి కాదు. అయితే ఇవి ఆనాటి పాలకులు రూపొందించిన సంప్రదాయాలనో, లేదా ముస్లింలు మాత్రమే మనకు జ్ఞానబోధ చేశారనో చెప్పడం కాదు. అందుకు విరుద్ధంగా, ఈ సంస్కృతి, దేశీయ కళలు, సంప్రదాయాలు, భాషలతో మొఘలులు, సుల్తానులు, మమేకవడం వలన ఏర్పడ్డవి అని చెప్పాల్సి ఉంటుంది. మనుగడలో ఉన్న సంస్కృతిని వారు అక్కున చేర్చుకున్నందు వలన ఏర్పడ్డది.
అమీరుఖుస్రు గురించి మాట్లాడేటప్పుడు ఆనాటి రాచ దర్బార్‌లో ఉన్న గొప్ప హిందూకవి గోపాల్‌నాయక్ గురించి మాట్లాడకుండా ఉండగలమా? ఖుస, గోపాల్‌నాయక్ నుండే సంగీతం గురించి ఎంతో తెలుసుకున్నారు. హిందుస్తానీ ప్రాచీ న సంగీతం గురించి చెప్పుకొనేటప్పుడు లేదా కథక్ గురించి మాట్లాడుకునేటప్పుడు దపద లేదా ‘రసా’లను గురించి ప్రస్తావిం చకుండా ఉండగలమా? పండిట్ హరిదాస్ గురించి మాట్లాడు కునేటప్పుడు తాన్సేన్‌ను విస్మరించగలమా? కథక్ సంప్రదాయా లలో రసలీలా సంప్రాదయాలు లేని రామాయణ, మహాభార తాలు ఊహించగలమా? శివుడిని కొలిచేటప్పుడు ద్రుపద్ లేకుం డా ఉంటుందా? హోలీలో ఢమరుకం లేకుండా ఉండడం సాధ్య మా? అక్బర్ ఆత్మకథని రాసిన అతని కొలువులోని కవి, అబుల్ ఫజల్‌ను గురించి చదవండి. అతడు హిందువుల నమ్మకాలని, అలవాట్లని, శాస్త్రజ్ఞానాన్ని, తాత్విక చింతనని ఎలా పొగిడాడో తెలుసుకోండి. హిందువుల సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచా నికి అందించడానికి, అక్బర్ మహాభారతాన్ని పర్షియన్ భాషలోకి అనువదించడాన్ని ప్రారంభించాడని మీకు తెలుసా? అతడు మహాభారతానికి ఒక గొప్ప అభిమాని. అతనికి పర్షియన్ భాష లోకి మహాభారతాన్ని చేసిన అనువాదం వినిపిస్తే, అది అంతగా బాగులేదని కొట్టిపడేసాడట. కథక్ నృత్యాలు, నాటకాలు, కవి తలు గురించి నవాబ్ వాజిద్ అలీషా కృషిని గుర్తు చేసుకోండి. అవన్నీ తన కొలువులో ఉన్న హిందూ పండితుల రాధాకష్ణుల సాంప్రదాయ ఉత్సవాలతో ప్రభావితమైనవే.
చరిత్రంతా చెప్పడం నా ఉద్దేశం కాదు. మన సంస్కృతి బ హుళ సంస్కృతి అని చెప్పాలన్నదే నా ఆకాంక్ష. నేను మొఘలుల వారసత్వాన్ని ప్రేమిస్తున్నానంటే దానర్ధం హిందూ, ముస్లింల రెండు సంస్కృతులనీ ప్రేమిస్తున్నానని. అవి రెండూ భిన్నంగా లేవు. పూర్తిగా కలిసే ఉన్నాయని. ఒకదాని నుండి వేరొకదానిని విడదీయలేనంతంగా మమేకమయ్యాయని. విదేశ సంప్రదాయా న్నో, భాషనో దేశీయ భాషలపై సంప్రదాయాలపై రుద్దినట్టు కా దు. రెండు సంప్రదాయాల మేళవింపుతో కొత్త సంప్రదాయాలు ఉద్భవించాయి. మొఘలుల రాజ్యంలో సంస్కృతి ఇక్కడే రూపొందినది. ఇతరదేశాల నుండి దిగుమతి చేయబడలేదు. ఈ నేల లోనే వృద్ధి చెందింది.
నేను తమిళ బ్రాహ్మణుల, పంజాబీ సిక్కుల వారసత్వాన్ని కలిగి ఉన్నాను. నా భర్త రాజస్థానీ జాట్, జాత్ శిక్కు చరిత్ర కలవాడు. సైనిక నేపథ్యం కలవాడు కూడా. అతని వార సత్వాన్ని కూడా అనుసరించడం నాకిష్టం. అందులో కూడా ఎన్నో వీరగాధలు, ధైర్య సాహసాలు ఇమిడి ఉన్నాయి- నా వార సత్వంలాగే. హిందుత్వ వాదులు మనకి ఒకే మతం,ఒకే సంప్ర దాయం, ఒకే సంస్కృతి ఉండాలని అంటారు. అది వాస్తవం కాదు. మనకి వైవిధ్య భరితమైన నాగరికత ఉండవచ్చు. అందు లో కొన్ని సనాతన సంప్రదాయాలు ఉంటాయి. కొన్ని ఆధునిక సంప్రదాయాలు ఉంటాయి. ఈ భిన్నత్వం అనాదిగా ఉండేదే. ఎన్నో కొత్త సంస్కృతులను ఆహ్వానించాము. కొన్నిటిని వదులుకు న్నాము. అశోకుడు మూడో శతాబ్దంలోనే ‘అన్ని రకాల నమ్మకా లున్నవారంతా కలిసిమెలసి నా రాజ్యంలో ఉండాలన్నది నా వాంఛ’ అన్నాడు. అందరూ మంచి ఆలోచనలను, మంచి నడవ డిని కలిగి ఉండడమే ప్రధానం. ఇతరుల నమ్మకాలను అర్ధం చేసుకోవాలి. సంస్కృతి, స్నేహానికి, ఆహ్వానానికి ప్రతీక కావాలి.
రెండువేల సంవత్సరాల తరువాత అక్బర్ కూడా ఇవే మాట లన్నాడు. ”సంబంధిత విచారణ చేసే కాలంలో న్యాయానికి అనుగుణంగా నడిచేవాడు, నమ్మకాలలో హేతువాదం గ్రహించే వాడు మనిషి. ఈ విధంగా చేస్తే తాళం చెవి పోయినా తాళాలు తెరుచుకోవచ్చు” అన్నాడు
‘మనమేధో చక్షువులకు నిజమైన దృష్టి ఉంటే, ప్రతి వ్యక్తి తనకుతానుగా ఈ గందరగోళాల నుండి బయటపడి తన సందేహాలను తానే నివృత్తి చేసుకుంటాడు. ఇతరుల జోలికె ళ్లడు. అందువలన తమలో, ఇతరులలో ఉన్న అసమ్మతిని శాంతియుతంగా పరిష్కరించుకోగలుగుతాడు. ఐకమత్యమనే నందనవనంలో కలహాల కుంపట్లు రాజేయకుండా ఉంటాడు.’
అయిదు వందల ఏళ్ల తరువాత గాంధీజీ, ‘నిజమైన మ తం ప్రతివ్యక్తి స్నేహపూర్వకంగా, సేవాభావంతో ఉండాలని బోధిస్తుంది. నేనీ విషయాన్ని మా అమ్మ ఒడిలో నేర్చుకున్నాను. ఇలా అంటున్నందుకు మీరు నన్ను హిందువని అనడానికి నిరా కరించవచ్చు. అందుకు నేను ఇక్బాల్, ‘మతం మనకు ఇతరుల పట్ల ద్వేషాన్ని చిమ్మమని భోదించదు’ అని పాడిన పాటనే మీకు సమాధానం చెప్పగలుగుతాను.’
సంప్రదాయకంగా నేను నా చిన్ననాటి నుండి ఉన్న అల వాటు ప్రకారం తమిళ బ్రాహ్మణుల పద్ధతులలో పూజలు చేసినా, నాకు నిజాముద్దీన్ దర్గా అయినా, వాటికన్ అయినా, జామా మసీదు అయినా, గణేశుడి గుడి అయినా ఒక్కటే. నేను సనాతన హిందువును కాదు. నాకు మంత్రాలన్నీ తెలియవు. ఉపవాసాలు, దీక్షలు చేయను. ప్రతిరోజూ గుడికి కూడా వెళ్లను. అయితే, హిం దుత్వాన్ని ప్రచారం చేసే వాళ్ళయినా సనాతన హిందువులని అనుకోను. ఈ ఆధునిక యుగంలో సనాతన హిందువుగా జీవిం చడం- పెళ్ళిలో, ఆహారంలో, అలవాట్లలో, ఆహార్యంలో, జీవన విధానంలో సాధ్యపడదు. నిజానికి 22వ తేదీ జరిగే ఈ కార్యక్ర మంలో కూడా హిందూ సనాతన ధర్మాన్ని అనుసరించడం లేదు – శంకరాచార్యులు సనాతన ధర్మాన్ని విస్మరించారని గొడవ చేస్తూనే ఉన్నారు.
నావరకు నాకు హిందూ మతం అంటే, దేవుళ్ల గురించి చెప్పే కథలు. అవన్నీ నిజమనిపిస్తాయి. ప్రాచీన గాధలు, యు ద్ధాలు, ప్రేమలు, తాత్విక సంవాదాలు. అవన్నీ చూడకపోయినా కళ్ళకు కట్టినట్టు అనిపిస్తాయి. అవి మన చుట్టూ ఉన్న ప్రపం చాన్ని రంగులమయం చేస్తాయి. మనకు ఆత్మసంతృప్తిని కలిగి స్తాయి. నేను హార్మోనియం మోగించడం మొదలు పెట్టగానే సర స్వతీదేవి నా ముందు ప్రత్యక్షమవుతుంది. నా పిల్లల అల్లరి చూడగానే యశోద గుర్తుకొస్తుంది. అల్లరి కృష్ణుడు నాకు స్వాంత ననిస్తాడు. నేను పిల్లలను పెంచుకోడానికి ఉద్యోగం మానేస్తా నంటే ఫెమిస్టులంతా కన్నెర్ర చేసారు. కానీ పూర్తికాలం అమ్మగా పని చేయడంలో నాకు ఎంతో బలం, ఆత్మవిశ్వాసం కలిగాయి. హిందుత్వం బోధించే విధేయత, త్యాగం, సేవలో- మనలను మనం మరిచిపోయి తనువూ, మనసు, ధనం అర్పించడంలో- కర్తవ్యం నిర్వహించడంలో, ఆదర్శం కనిపించింది. అందువలన నేను హిందువునని నిజాయితీగా నమ్ముతాను. హిందూమతం ఇది కాదంటే నేను హిందువుని కాను.
హిందుత్వ వాదులు ప్రచారం చేస్తున్నట్టు మొఘలులు హిం దూరాజులను ఓడించి రాజ్యాధికారం చేపట్టలేదు. వాళ్లు ఓడిం చింది ఆనాడు పాలిస్తున్న లోడిని, ఒక ముస్లిం రాజుని. అంతకు ముందు బాబర్ పంజాబ్‌లో దౌలత్ ఖాన్‌ని ఓడించాడు. నిజా నికి ముస్లింలు ముస్లింలను జయించారు. బాబర్ కాబుల్‌లో ఆఫ్ఘన్లను జయించాడు. కొంతమంది చరిత్రకారులు ఇబ్రహీం లోడిని దించడానికి రాణాప్రతాపసింగ్‌కి బాబర్‌కి మధ్య ఒప్పం దం కూడా కుదిరిందని అంటారు. కానీ ఇబ్రహీంలోడి ఓడి పోయి, అతని తమ్ముడు రాణాప్రతాప్ సింగ్ సైన్యంలో చేరడం వలన ఆ మిత్రుత్వం అమలుకు నోచుకోలేదు. అందువలన బాబర్ కథ-ముస్లింలు భారతదేశాన్ని ఆక్రమించారని ప్రచారం లో పెట్టిన కథ- వాస్తవ విరుద్ధం.
బాబర్ చేసిన యుద్ధాలలో హింసలేదని, విధ్వంసం లేదని నేననడం లేదు. దండయాత్ర జరిగిన తొలి నాళ్లలో హిందువులు అనేకమైన సర్దుబాట్లు చేసుకుని ఉంటారు. కానీ మొఘలులు ముస్లిం మత ప్రచారానికి మాత్రమే దండయాత్రలు చేయలేదని మనం గ్రహించాలి. అది సామ్రాజ్యవాదులకాలం. ఆ సామ్రాజ్య వాదాన్ని అంతం చేసి ప్రజాస్వామ్యం, లౌకికవాదం, పరమత సహనం కోసమే యుద్ధాలు జరిగాయి. ఇప్పటికయినా మనం ఇటువంటి అనాలోచిత విధానాలకు స్వస్తి పలకలేమా?
మొఘలులు పాలించిన 500 ఏండ్లు, వాళ్లు రాజపుత్రులకి విరోధులుగా లేరు. వాళ్ళ సైనికాధికారులలో కొందరు రాజపు త్రులు ఉండేవారు. ముస్లిం రాజుల వస్త్రధారణ, నిర్మాణ శిల్పం, సంస్కృతి రాజపుత్‌ల నుండి గ్రహించినవే. అందువలన 500 ఏళ్ల బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పే రామ జన్మభూమి కథ పచ్చి అబద్ధం. మొఘలుల పాలన అటువంటిది కాదు. అది దండయాత్రలు చేసే రాజుల ఆశ, కాంక్ష. అందులో హిందూమతం, ఇస్లాం మతం ప్రసక్తి లేదు. ఔరంగజేబు తప్ప మిగిలిన రాజులెవరు ఇస్లాం మతాన్ని నిష్టగా పాటించినవారు కాదు. అందరూ సారా తాగేవారు. నల్లమందు వేసుకునేవారు. ఉలేమాలకు బదులుగా సూఫీలను కోరుకునేవారు. నిజానికి దీన్ ఇల్లాహి కారణంగా, అక్బర్‌కి ఇస్లామేతరుడనే ముద్ర కూడా ఉంది.
జై హింద్
(కూతురు ప్రకటనకు గర్విస్తూ తండ్రి మణిశంకర్ అయ్యర్ సోషల్ మీడియా పోస్టుకు (సంగ్రహ) స్వేచ్ఛానువాదం.)
అనువాదం : కె.ఉషారాణి