శ్రీమిత్ర పాండేషన్ (రిజిస్ట్రేషన్ నెంబర్ 320) మండల అధ్యక్షుడుగా మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన కేశారపు సురేందర్ ను నియమించి, నియామక పత్రాన్ని అందజేసినట్లుగా శ్రీమిత్ర పాండేషన్ చైర్మన్ అట్టెం రమేష్ ముదిరాజ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికైన సురేందర్ మాట్లాడారు. ఆపదలో ఉన్నవారికి విద్య, వైద్యం, సంక్షేమ అభివృద్ధికి, సాంస్కృతిక పురోగతికి చైర్మన్ ఆదేశాల మేరకు తన వంతుగా కృషి చేస్తానని ప్రకటించారు. తన ఎన్నికకు సహకరించిన జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.