నవతెలంగాణ – రామారెడ్డి
మాజీ యంల్ఏ సురేందర్కు కాంగ్రెస్ను విమర్శించే హక్కు లేదని మాజీ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ దయవల్లే నీవు ఎమ్మెల్యే అయ్యావని మర్చిపోకు, కెసిఆర్ ఇచ్చిన హామీలు దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాల భూమి, నిరుద్యోగ భృతి, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, రుణమాఫీ ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించి, ఉపాధ్యాయ నియామకం ఎందుకు చేపట్టలేదని. నియంతృత్వం, దొరల పాలనకు ప్రజలు చరమగీతం పాడిన మీకు ఆత్మ పరిశీలన చేసుకోకుండా, ఆరోపణలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని పేర్కొన్నారు. నీవు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించారని. ఎంతమందికి రుణమాఫీ చేయించావని పేర్కొన్నారు. అర్హులై ఉండి రుణమాఫీ కాని వారికి త్వరలో క్షేత్రస్థాయిలో ఎంక్వయిరీ చేసి రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెబుతున్న, రైతుల మీద రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూస్తే, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు మిమ్మల్ని బొంద పెడతాయి పేర్కొన్నారు.