పిడిఎస్ యు రాష్ట్ర కార్యదర్శిగా సురేష్ 

నవతెలంగాణ –  కామారెడ్డి
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత సంఘం ఆధ్వర్యంలో ఈనెల ఫిబ్రవరి 4, 5 తేదీలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణ కేంద్రంలో పిడిఎస్యు తెలంగాణ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ నిర్వహించరు. ఈ జనరల్ కౌన్సిల్లో కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సురేష్ ని రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం జరిగిందనీ సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ విద్యార్థుల అసమాన త్యాగాల మీద ఏర్పడిన విద్యార్థి సంఘం తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను ఇచ్చినందుకు విద్యారంగ సమస్యలపై ప్రజా సమస్యలపై కార్మిక సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై రాజీలేని సమరశీల  పోరాటాలు నిర్వహిస్తానని  పేర్కొన్నారు.  మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు విద్యార్థుల ఫీజుబకాయలు ఇవ్వకపోవడం, ప్రభుత్వ వసతి గృహాలలో మెనూ ప్రకారం నిధులు విడుదల చేయకుండా విద్యార్థులను పౌష్టికాహారానికి దూరం చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ విధానం మార్చుకోకపోతే విద్యార్థులు అందరిని చైతన్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.