అంగన్ వాడీలకు కేంద్ర బడ్జెట్ లో మొండిచేయి: సురేష్ గొండ

Angan wadis are stubborn in the central budget: Suresh Gondaనవతెలంగాణ – జుక్కల్
కేంద్ర బడ్జెట్లో ఐసీడీఎస్ అంగన్వాడీలకు నిధులు తగ్గించి అన్యాయం చేశారని, అంగన్వాడీ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు సురేష్ అన్న ఆరోపించారు. గత బడ్జెట్లో 2023 – 2024 బడ్జెట్లో ఇరవై ఒక్క వేల 523 కోట్లు కేటాయించగా, ప్రస్తుత 2024 – 2025 బడ్జెట్లో రూ.21 వేల 200 వందల కోట్లు  కేటాయించింది. అంటే రూ.323 కోట్లు తగ్గించినట్లు బడ్జెట్లో చూపించారు. ఇప్పుడున్న అన్ని రకాల ధరలు పెరిగాయి. ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు ఎలా పెంచుతారని సురేష్  ప్రశ్నించారు. గతంలో బడ్జెట్ తగ్గించారు. కావున సీఐటీయూ ఆధ్వర్యంలో.. అంగన్వాడీలు చలో ఢిల్లీ పిలుపునివ్వడం జరిగింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం రూ.1500 పెంచుతామని రెండుసార్లు ప్రకటించి, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసం చేసింది. ఈ బడ్జెట్లో అంగన్వాడీల జీతాలు  ఎంత పెంచుతున్నారో చెప్పలేదు. కావున బడ్జెట్లో మన వాటా కోసం పోరాటం చేయాలి. ఐసీడీఎస్ వాటా కోసం కేంద్ర, రాష్ట్ర కమిటీలు ఏ పోరాటానికి పిలుపునిచ్చినా.. కామారెడ్డి జిల్లాలోని ఐదు ప్రాజెక్ట్ లలోని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ సిద్ధంగా ఉండాలని సురేష్  ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.