కారు టైర్ పంక్చర్ అయిందని పువ్వు పై కూర్చున్న బిజినెస్ మ్యాన్ సురేష్ షట్కర్

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి సురేష్ షట్కర్ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ తో కలసి రోడ్ షో నిర్వహించారుగాంధారి మండల కేంద్రంలో భారీ ర్యాలీతో గాంధారి వీధుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ హామీలను ప్రజలకు తెలియచేసారు. ఈ సందర్బంగా సురేష్ శెట్కార్  మాట్లాడుతూ.. బీజేపీ ఎంపీ గా పోటీ చేసే అభ్యర్థి బీబీ పాటిల్ కాదు బిజినెస్ పాటిల్, బిజినెస్ లకుతప్ప రాజకీయాలకు ఏ మాత్రం పనికి రాడని ఆయన అన్నారు ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ గాంధారి మండలాన్ని దత్తత తీసుకుంటానని మోసం చేసి అభివృద్ధి ఏం లేకుండా మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తున్నాడు, కార్ టైర్ పంక్చర్ అయిందని పువ్వు పై కూర్చున్నాడన్నారు. కాంగ్రెస్ పార్టీ ని గెలిపిస్తే ఎమ్మెల్యే, ఎంపీ కలిసి జోడేద్ధుల్లా పని చేసి నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో ఉంచుతామన్నారు.  శెట్కార్  ఎంపీ గా ఉన్నప్పుడు ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఎన్నో బ్రిడ్జి లు, రోడ్లు వేశామని తెలిపారు. బీబీ పాటిల్ ని గెలిపిస్తే బొంబాయి లో తప్ప తెలంగాణ కి రాడు, ఇందిరమ్మ రాజ్యం తీసుకరావాలంటే కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసి గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.