
నవతెలంగాణ – మద్నూర్
కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సురేష్ షెట్కార్ గెలుపు కోసం ప్రత్యేక దృష్టి సాధిస్తుంది గ్రామాల్లో కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, పార్టీ అభ్యర్థి గెలుపు కోసం నాయకులకు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ మద్నూర్ మండల అధ్యక్షులు దరాస్ సాయిలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేస్తున్న పథకాలు ప్రత్యేకంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మద్నూర్ మండలంలోని అంతాపూర్ గ్రామంలో నిర్వహించిన సమావేశంలో నాయకులకు కార్యకర్తలకు సూచించారు. ఇంటింట ప్రచారం ముమ్మరం చేద్దాం ప్రజలకు కల్పించే సంక్షేమ పథకాలు ప్రజల దృష్టికి తీసుకు వెళ్దాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రత్యేకంగా కృషి చేద్దామని ఆయన సమావేశంలో నాయకులకు కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్ద తడగూర్ కాంగ్రెస్ నాయకులు ఈరన్న అలాగే అంతాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.